ఏపీ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి | Telangana private college association takes on AP Private colleges | Sakshi
Sakshi News home page

ఏపీ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి

Nov 26 2014 12:08 PM | Updated on Aug 18 2018 9:09 PM

ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ కాలేజీలు తమకు శాపంగా మారాయని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు తమకు శాపంగా మారాయని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించింది. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ఏపీ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఇప్పటికే సదరు కాలేజీల పీఆర్వోలు పదో తరగతి విద్యార్థులకు తీవ్ర ఆటంకంగా మారారని విమర్శించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉమ్మడి ఇంటర్ పరీక్షల నిర్వహాణకు తాము పూర్తి వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. అలాగే ఎంసెట్ పరీక్ష కూడా తెలంగాణలో విడిగా జరగాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అభిప్రాయపడ్డింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement