ఇంటర్ పరీక్షల తేదీల ప్రకటన
జనవరి 21 నుంచి ప్రాక్టికల్స్.. టైంటేబుల్ విడుదల చేసిన బోర్డు
ఈ నెల 14 వరకు ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షా సమయం ఉండనుంది. ఈ మేరకు బోర్డు శుక్రవారం ఎగ్జామ్ టైంటేబుల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 21న ఫస్టియర్ విద్యార్థులకు, 22న సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను నిర్వహించనుంది. జేఈఈకి హాజరయ్యే వారికి ప్రయోగపరీక్షల విషయంలో వెసులుబాటు కల్పించనుంది. జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుంది.

ఫీజు ఖరారు..: ఇంటర్ పరీక్షల ఫీజు గడువును బోర్డు ఖరారు చేసింది. జనరల్ విద్యార్థులకు రూ. 530గా, ప్రయోగ పరీక్షలకు రూ. 100గా నిర్ణయించింది. వొకేషనల్ విద్యార్థులకు రూ. 870 (థియరీ రూ. 530+ప్రాక్టికల్స్ రూ. 240+ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ రూ. 100)గా ఖరారు చేసింది. ఈ నెల 14 వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ. 100 ఫైన్‌తో ఈ నెల 24 వరకు, రూ. 500 ఫైన్‌తో డిసెంబర్ ఒకటి వరకు, రూ. 1,000 ఫైన్‌తో డిసెంబర్ 8 వరకు, రూ. 2 వేల ఫైన్‌తో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించొచ్చు.


