నీట్‌ ప్రొవిజనల్‌ జాబితా విడుదల

Telangana NEET State Quota Merit List 2018 Provisional MBBS Ranks - Sakshi

3,235 మంది వివరాలతో మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించిన కాళోజీ వర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) తెలంగాణ ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించింది. తెలంగాణలోని విద్యార్థుల నీట్‌ ర్యాంకుల ఆధారం గా ప్రోవిజనల్‌ మెరిట్‌ లిస్టును వైస్‌చాన్స్‌లర్‌ బి.కరుణాకర్‌ వెల్లడించారు. తాజా వివరాలు ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా మాత్రమేనని, దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా సీట్ల భర్తీకి ముందు తుది ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా ప్రకారం రోహన్‌పురోహిత్, వరుణముప్పిడి, సిద్దార్థ్‌ రవి, టి.మహేశ్, జి.శ్రీ వత్సవ్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. 3,235 మంది వివరాలతో ప్రొవిజనల్‌ జాబితా రూపొందించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top