
నారాయణపేట: అతని వయసు పెరిగినా శరీరం పొడవు పెరగలేదు. సాధారణంగా ఉన్నవారిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో తనలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటే సమస్య ఉండదని భావించాడు. వెంటనే తన ఫోటో, ప్రొఫైల్‌ను వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు నారాయణపేట జిల్లా అచ్చంపేటకు చెందిన మున్నా. ఆ ఫోటో అటు, ఇటు తిరిగి నారాయణపేట మండలం తిర్మలాపూర్‌కు చెందిన వ్యక్తి వద్దకు చేరింది. వెంటనే ఆయన అదే గ్రామంలో ఉన్న బసప్ప కుమార్తె భాగ్యమ్మకు చూపించాడు. అనంతరం అబ్బాయి ఫోన్ నంబర్ ఆధారంగా వాట్సాప్‌లోనే పెళ్లిచూపులు కానిచ్చారు. ఇద్దరూ ఒప్పుకోవడంతో గురువారం తిర్మల్‌దేవుని సన్నిధిలో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.