రేపే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు | Telangana Inter Results 2020 Will Release On 18th June | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Jun 17 2020 11:51 AM | Updated on Jun 17 2020 11:58 AM

Telangana Inter Results 2020 Will Release On 18th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 18న ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు  తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.  పరీక్షల ప్రక్రియను ఇప్పటికే బోర్డు పూర్తి చేసింది. పరీక్షల ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  మరోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెబ్‌ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్‌ మెసేజ్‌ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement