పది పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Telangana High Court Green Signal On Conducting Of Tenth Class Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై  హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. (‘కేసీఆర్‌ భాష సరిగా లేదు’)

జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఇక జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top