ఇంటర్‌ విద్యకు ‘చైనా’ వైరస్‌

Telangana Government Review On Inter Colleges Infrastructure - Sakshi

విద్యార్థుల జీవితాలతో ఆ రెండు కార్పొరేట్‌ కాలేజీల చెలగాటం

అనుమతుల్లేని హాస్టళ్లలో అత్యధికం ఆ కాలేజీలవే

లక్షల్లో ఫీజులు గుంజుతూ అరకొర సౌకర్యాలు

ఒక్కో హాస్టల్‌ గదిలో 8 మందిని కుక్కుతున్న వైనం

ఏటేటా సడలింపులతో కొనసాగిస్తున్నఇంటర్‌ బోర్డు

ఈసారైనా పక్కా చర్యలు ఉండేనా?

సాక్షి, హైదరాబాద్‌: అవన్నీ ఐదారు అంతస్తుల భవనాలు.. వాటిల్లో ఒకట్రెండు లిఫ్టులున్నా అవి విద్యార్థులు వినియోగించడానికి వీల్లేదు! భవనాల చుట్టూ ఫైర్‌ ఇంజిన్‌ తిరగడం కాదు కదా కనీసం ఆయా భవనాల్లో ఉండాల్సినన్ని అగ్నిమాపక పరికరాలకూ దిక్కులేదు!! ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఇక అంతే సంగతులు. ప్రమాదం అంచున వేల మంది విద్యార్థుల జీవితాలు. ఇదీ శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో పరిస్థితి. ఫైర్‌ సేఫ్టీ కచ్చితంగా ఉండాల్సిందేనని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏటా నోటీసులు ఇవ్వ డం.. అందినకాడికి ముడుపులు పుచ్చుకోవ డం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది.

విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే సాకుతో ఏళ్ల తరబడి షరతులతోనే ఆ కాలేజీలను యాజమాన్యాలు కొనసాగిస్తున్నా యి. ఈసారీ అదే ఆయుధాన్ని ఉపయోగిం చాయి. అయితే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో 2020– 21విద్యా సంవత్సరంలో ఆయా కాలేజీ లపై పక్కా చర్యలు చేపడతామని ఇంటర్మీడియెట్‌ బోర్డు చెబుతున్నా ఎంతవరకు ఆచరిస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అనుమతుల్లేకుండా కొనసాగుతున్న ఆయా కాలేజీల హాస్టళ్లు నరకానికి నకళ్లుగా ఉన్నా అధికారులకు కనీస పట్టింపు లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఆ రెండింటివే 44 కాలేజీలు...
ఫైర్‌ సేఫ్టీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కాలేజీలు రాష్ట్రంలో 79 ఉండగా అందులో 44 కాలేజీలు ఆ రెండు విద్యాసంస్థలకు సంబంధించినవే ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు తేల్చింది. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన జూనియర్‌ కాలేజీలు 18 ఉండగా, నారాయణ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలు 26 ఉన్నాయి. ఇక శ్రీగాయత్రి విద్యాసంస్థలకు చెందిన కాలేజీలు 8 ఉండగా ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలకు చెందిన కాలేజీలు 5 ఉన్నాయి. ఇవే కాకుండా తపస్యా జూనియర్‌ కాలేజీ, క్వీన్‌ మేరీ, లియో, క్షత్రియ, క్వీన్‌ మేరీ, గౌతమి తదితర కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆ విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే...
తమిళనాడు కుంభకోణంలోని ఓ పాఠశాలలో 2004లో జరిగిన అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. ఆ తరువాత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫైర్‌ సేఫ్టీ, అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాల్లో ఎలాంటి విద్యాసంస్థలను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో ఆ నిబంధనలను అమలు చేయడంలో ఇంటర్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. 15 మీటర్లకు మించిన భవనాల చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేలా సెట్‌ బ్యాక్స్‌ ఉండాలన్న నిబంధనను కార్పొరేట్‌ విద్యాసంస్థలు అమలు చేయడం లేదు. కనీసం భవనాల్లో సరిపడా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ విద్యార్థుల జీవితాలను ప్రమాదం అంచుకు నెట్టేస్తున్నాయి.

హాస్టళ్లలో పరిస్థితి దుర్భరం..
అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా కొనసాగుతున్న కాలేజీలను కొనసాగి స్తున్న విద్యా సంస్థలే హాస్టళ్లను సైతం నిర్వహిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాష్ట్రంలో దాదాపు 500 హాస్టళ్లను జూనియర్‌ కాలేజీలకు అనుబంధంగా కొనసాగిస్తున్నాయి. మూడేళ్ల కిందట హాస్టళ్ల నియంత్రణను ఇంటర్‌ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినా అది అచరణకు నోచుకోలేదు. పైగా అందులో అత్యధికంగా ఉన్నవన్నీ బహుళ అంతస్తుల భవనాల్లో కొనసాగుతున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఇక ఆయా హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి మరీ దుర్భరం. ఒక్కో గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున ఉండాల్సి ఉన్నప్పటికీ 8 మందిని కుక్కుతున్నట్లు ఇంటర్‌ బోర్డు తనిఖీల్లో తేల్చింది.

అంతేకాదు సరిపడా టాయిలెట్లు లేని దుస్థితి నెలకొందని గుర్తించింది. ఏసీ గదుల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కనీసం ఫ్యాన్లకు దిక్కులేని పరిస్థితిని యాజమాన్యాలు కల్పిస్తున్నాయని కనుగొంది. ఒకట్రెండు లిఫ్ట్‌లు మాత్రమే పెట్టి, అవీ విద్యార్థులను వాడనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థులు రోజూ నాలుగైదు అంతస్తులు ఎక్కి దిగేందుకు ఇబ్బందులు పడతున్నా యాజమన్యాలు లేదా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

అడ్డూ అదుపులేని ఫీజులు..
కాలేజీల్లో ఫీజల నియంత్రణ ఇంటర్‌ బోర్డుకు పట్టడం లేదు. రకరకాల పేర్లతో రూ. లక్ష నుంచి మొదలుకొని రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదు. 10–20 మంది టాప్‌ ర్యాంకర్లను ఎరగా చూసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఫీజు చెల్లించడంలో ఆలస్యమైతే విద్యార్థులను టీసీ ఇచ్చి పంపేస్తున్నాయి. ఇటీవల అవినాష్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదన్న సాకుతో వేధిస్తున్నారంటూ దీపక్‌ అనే విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

అనుమతులు లేకుండానే రాష్ట్రంలో దాదాపు 500 హాస్టళ్లను జూనియర్‌ కాలేజీలకు అనుబంధంగా కొనసాగిస్తున్నాయి. మూడేళ్ల కిందట హాస్టళ్ల నియంత్రణను ఇంటర్‌ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినా అది ఆచరణకు నోచుకోలేదు. పైగా అందులో అత్యధికంగా ఉన్నవన్నీ బహుళ అంతస్తుల భవనాల్లో కొనసాగుతున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఇక ఆయా హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి మరీ దుర్భరం. ఒక్కో గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున ఉండాల్సి ఉన్నప్పటికీ 8 మందిని కుక్కుతున్నట్లు ఇంటర్‌ బోర్డు తనిఖీల్లో తేల్చింది.

అంతేకాదు సరిపడా టాయిలెట్లు లేని దుస్థితి నెలకొందని గుర్తించింది. ఏసీ గదుల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కనీసం ఫ్యాన్లకు దిక్కులేని పరిస్థితిని యాజమాన్యాలు కల్పిస్తున్నాయని కనుగొంది. ఒకట్రెండు లిఫ్ట్‌లు మాత్రమే పెట్టి, అవీ విద్యార్థులను వాడనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థులు రోజూ నాలుగైదు అంతస్తు లు ఎక్కి దిగేందుకు ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యాలు లేదా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

అడ్డూ అదుపులేని ఫీజులు:
కాలేజీల్లో ఫీజల నియంత్రణ ఇంటర్‌ బోర్డుకు పట్టడం లేదు. రకరకాల పేర్లతో రూ. లక్ష నుంచి మొదలుకొని రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదు. 10–20 మంది టాప్‌ ర్యాంకర్లను ఎరగా చూసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఫీజు చెల్లించడంలో ఆలస్యమైతే విద్యార్థులను టీసీ ఇచ్చి పంపేస్తున్నాయి. ఇటీవల అవినాష్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదన్న సాకుతో వేధిస్తున్నారంటూ దీపక్‌ అనే విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top