ఉద్యోగుల డీఏ ఉత్తర్వులు జారీ | telangana government issues DA hike orders | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డీఏ ఉత్తర్వులు జారీ

Oct 2 2014 2:08 AM | Updated on Sep 2 2017 2:14 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుకగా 5.99 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

71.904 శాతం నుంచి 77.896 శాతానికి పెరిగిన కరువు భత్యం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుకగా 5.99 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్  నెల వేతనం వరకు కరువు భత్యాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తున్నట్లు.., అక్టోబర్ నుంచి వేతనంలో కలిపి నగదు రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు 71.904 శాతం ఉన్న కరువు భత్యం, 77.896 శాతానికి పెరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూజీసీ స్కేల్ తీసుకుంటున్న వారికి ప్రస్తుతం ఉన్న డీఏ 100 నుంచి 107 శాతానికి పెరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఆర్‌ఏ, పార్ట్‌టైమ్ అసిస్టెంట్స్‌కు రూ.100 నగదును చెల్లించనున్నట్లు కూడా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. జీపీఎఫ్ అకౌంట్స్ లేని శాశ్వత ఉద్యోగులకు వేతనంతోనే బకాయిల మొత్తాన్ని చెల్లిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement