బీసీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి | Telangana Government commit for the BC's Development | Sakshi
Sakshi News home page

బీసీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి

Feb 23 2016 12:11 PM | Updated on Oct 3 2018 5:26 PM

బీసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు.

బీసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆయన ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జనాభా ప్రాతిపదికన అధిక సంఖ్యలో ఉన్న బీసీల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటామని, హరిత తెలంగాణకు కృషి చేస్తున్నామని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement