సోనియా దయవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు | Telangana Formed Because Of Sonia Gandhi Says Chenna Reddy | Sakshi
Sakshi News home page

సోనియా దయవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

Jun 3 2018 1:31 PM | Updated on Apr 7 2019 3:47 PM

Telangana Formed Because Of Sonia Gandhi Says Chenna Reddy - Sakshi

కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి

మహబూబాబాద్‌ : సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ కేవలం తమ పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భూక్యా ఉమ, పట్టణ అధ్యక్షుడు రామగోని రాజుగౌడ్, జడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, నాయకులు దసృనాయక్, హెచ్‌.వెంకటేశ్వర్లు, బానోత్‌ ప్రసాద్, నెమ్మది సుదర్శన్, డాక్టర్‌ మురళీనాయక్, నూనావత్‌ రమేష్, కత్తి స్వామి, చెలమల నారాయణ, పెండ్యాల శ్రీను, దళ్‌సింగ్, జలీల్‌ పాల్గొన్నారు. 
కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement