అంబరాన్నంటిన సంబురాలు | telangana formation celebrations in tngo's employees | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన సంబురాలు

Jun 3 2014 2:24 AM | Updated on Aug 15 2018 9:20 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లాప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్థానిక ప్రగతి భవన్ ముందు సోమవారం ఉద్యోగులు పెద్ద ఎత్తున ‘ప్రత్యేక’ సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు.

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లాప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్థానిక ప్రగతి భవన్ ముందు సోమవారం ఉద్యోగులు పెద్ద ఎత్తున ‘ప్రత్యేక’ సంబు రాలను ఆనందంగా జరుపుకున్నా రు. ధూం-ధాం ఏర్పాటుచేసి,ఆట,పాటలతో సందడిచేశారు. అంతకు ముందు టీఎన్జీవోస్ కార్యాలయం  నుంచి ఉద్యోగులు రైల్వే స్టేషన్, ఎస్పీ క్యాంపు కార్యాలయం మీదుగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అమరులైన వివిధ శాఖల ఉద్యోగులు టి.రాజు(డీఎంహెచ్‌ఓ), బోయిని వేణు(విద్యాశాఖ), హైమద్(తహశీల్దార్ కార్యాలయం),నర్సింగ్‌రావు(పాలిటెక్నిక్)లకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగుల ఉద్యమ ఫలితమేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉద్యోగులు ఎన్నో కష్టాల ఎదుర్కొన్నారన్నారు.  కేసులు నమోదు చేసినా, సస్పెండ్ చేసినా ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను  నెరవేర్చుతారనే నమ్మకం ఉందన్నారు. ఉద్యోగులకు ప్రత్యే క ఇంక్రిమెంట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఉద్యోగులు సమానమేనన్నారు. ఉద్యోగులు తప్పు  చేయకుండా తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని  ఆయన కోరారు. ఉద్యోగులు ఎవరూ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాను ఆదర్శం గా తీర్చిదిద్దుదామన్నారు.

  పని గంటలు పెంచుకోవడానికి సిద్ధం..
 అనంతరం టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎ. కిషన్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల  పాత్ర కీలకమైందన్నారు. 1948, 1969,2009 సంవత్సరాలలో జరిగిన  ఉద్యమాల్లో టీఎన్జీవోస్ ఉద్యోగులందరినీ ముందు ండి నడిపించిందన్నారు. తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి కోసం అవసరమైతే పని గంటలు పెంచుకోవడానికి సిద్ధమన్నారు. టీజీఓ అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ... దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రా న్ని అభివృద్ధి పరుచుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు.

  తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు  జమాల్‌పూర్ గణేశ్ మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా నాలుగున్నర కోట్ల ప్రజలు ఉద్యమించారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా అదేవిధంగా కృషి చేయాలని  కోరారు.  కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు నరేందర్, సుధాకర్, దయానంద్, శ్రీనివాస్‌రావు, టీజీఓ నాయకులు గంగాకిషన్, నిర్మల కుమారి, రెవె న్యూ ఉద్యోగులు, అన్ని సంక్షేమ శాఖ ఉద్యోగు లు, కార్పోరేషన్ ఉద్యోగులు, డీఆర్‌ఓ రాజశేఖ ర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం ఆధ్వర్యంలో  భోజనాలు ఏర్పాటు చేశారు.

 అలరించిన ఆట,పాట..
 చాలా రోజుల తరువాత మరోసారి  తెలంగాణ ఆట,పాట మార్మోగింది. అరుణోదయ కళాకారులు లక్ష్మణ్, రాంపూర్ సాయి బృందాలు తెలంగాణ ఆట,పాటలతో ఉద్యోగులను అల రించారు. ‘వీరులారా వందనం....’ అసైదుల ఆరతి...’ పొడుస్తున్న పొద్దుమీద...’ తదితర ఉద్యమ పాటలతో ఉర్రూతలూగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement