డిపార్ట్‌మెంటల్ టెస్టుల నోటిఫికేషన్ జారీ | telangana departmental tests notificication issued on tuesday | Sakshi
Sakshi News home page

డిపార్ట్‌మెంటల్ టెస్టుల నోటిఫికేషన్ జారీ

Apr 15 2015 12:28 AM | Updated on Sep 3 2017 12:18 AM

ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన డిపార్ట్‌మెంటల్ టెస్టుల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం జారీ చేసింది.

హైదరాబాద్ సిటీ: ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన డిపార్ట్‌మెంటల్ టెస్టుల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం జారీ చేసింది. వచ్చే నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఈనెల 18 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫీజు వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement