సీనియర్ ఐపీఎస్లతో సీఎం కీలక సమావేశం | telangana chief minister meets senior ips officers in camp office | Sakshi
Sakshi News home page

సీనియర్ ఐపీఎస్లతో సీఎం కీలక సమావేశం

Jul 2 2015 4:05 PM | Updated on Aug 11 2018 7:06 PM

సీనియర్ ఐపీఎస్లతో సీఎం కీలక సమావేశం - Sakshi

సీనియర్ ఐపీఎస్లతో సీఎం కీలక సమావేశం

పోలీసు ఉన్నతాధికారులు పలువురితో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు.

పోలీసు ఉన్నతాధికారులు పలువురితో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులు  సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా రావాల్సి ఉన్నా, ఆయన తల్లి మరణించడంతో రాలేకపోయారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీలు కూడా వచ్చారు. ఇటీవలే హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యలు చేపట్టిన రాజీవ్ త్రివేది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది.

ఓటుకు కోట్లు కేసులో ఇప్పటివరకు సాధించిన పురోగతి, బెయిల్ మీద జైలు నుంచి విడుడలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఆయన నేరుగా సీఎం, మంత్రులను ఉద్దేశించి విపరీత వ్యాఖ్యలు చేయడంతో దానిపై కూడా చర్చించారంటున్నారు. అసలు ర్యాలీకి అనుమతి లేకపోయినా భారీ ర్యాలీ ఎలా చేశారని చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొందరికి ఓటుకు కోట్లు కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement