breaking news
senior IPS officers
-
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి
-
సీనియర్ ఐపీఎస్‌లతో సీఎం కీలక సమావేశం
పోలీసు ఉన్నతాధికారులు పలువురితో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా రావాల్సి ఉన్నా, ఆయన తల్లి మరణించడంతో రాలేకపోయారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీలు కూడా వచ్చారు. ఇటీవలే హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యలు చేపట్టిన రాజీవ్ త్రివేది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఇప్పటివరకు సాధించిన పురోగతి, బెయిల్ మీద జైలు నుంచి విడుడలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఆయన నేరుగా సీఎం, మంత్రులను ఉద్దేశించి విపరీత వ్యాఖ్యలు చేయడంతో దానిపై కూడా చర్చించారంటున్నారు. అసలు ర్యాలీకి అనుమతి లేకపోయినా భారీ ర్యాలీ ఎలా చేశారని చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొందరికి ఓటుకు కోట్లు కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. -
సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను నియమించారు. ఇంటలిజెన్స్ అదనపు డీజీపీ ఏఆర్ అనురాధ, పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీపీగా వీఎస్కే కౌముది, సీఐడీ అదనపు డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఎన్వీ సురేంద్రబాబులను నియమించారు.