breaking news
camp office meet
-
జననేత వైఎస్ జగన్‌కు అభిమాన వెల్లువ.. (ఫొటోలు)
-
సీఎం జగన్‌తో తూర్పు తీర రక్షక దళ కమాండర్ భేటీ
సాక్షి, తాడేపల్లి: తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తూర్పు తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షకదళం చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు ఏడీజీ పరమేశ్ శివమణి. అలాగే సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్ ఢాకా, కమాండెంట్ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్ ఏబి.రామమ్ కూడా ఉన్నారు. -
సీనియర్ ఐపీఎస్‌లతో సీఎం కీలక సమావేశం
పోలీసు ఉన్నతాధికారులు పలువురితో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా రావాల్సి ఉన్నా, ఆయన తల్లి మరణించడంతో రాలేకపోయారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీలు కూడా వచ్చారు. ఇటీవలే హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యలు చేపట్టిన రాజీవ్ త్రివేది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఇప్పటివరకు సాధించిన పురోగతి, బెయిల్ మీద జైలు నుంచి విడుడలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఆయన నేరుగా సీఎం, మంత్రులను ఉద్దేశించి విపరీత వ్యాఖ్యలు చేయడంతో దానిపై కూడా చర్చించారంటున్నారు. అసలు ర్యాలీకి అనుమతి లేకపోయినా భారీ ర్యాలీ ఎలా చేశారని చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొందరికి ఓటుకు కోట్లు కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.