నేడు తెలంగాణ, ఏపీ స్పీకర్ల భేటీ | telangana, andhra speakers meet today | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ, ఏపీ స్పీకర్ల భేటీ

Mar 4 2015 1:16 AM | Updated on Sep 2 2017 10:14 PM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగే వీలుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే రోజు (ఈ నెల 7 నుంచి) మొదలు కావడం ఇదే ప్రథమం కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో సమావేశాలను ముగించేందుకు తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కలసి చర్చించాలని నిర్ణయించారు. వీరితో పాటు రెండు శాసన మండళ్ల చైర్మన్లు భేటీకి హాజరు కానున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement