‘మార్కెటింగ్‌’లో 200 ఖాళీల భర్తీకి అనుమతి  | Telangana Agriculture Marketing Department To Fill 200 vacancies | Sakshi
Sakshi News home page

‘మార్కెటింగ్‌’లో 200 ఖాళీల భర్తీకి అనుమతి 

Jun 7 2018 3:03 AM | Updated on Jun 7 2018 3:03 AM

Telangana Agriculture Marketing Department To Fill 200 vacancies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్కెటింగ్‌ శాఖలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసార థి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్‌–3 సెక్రటరీ పోస్టులు 11, అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులు 27, అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 80, గ్రేడర్‌ పోస్టులు 13, బిడ్‌ క్లర్క్‌ పోస్టులు 9, జూనియర్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 60 ఉన్నాయి. ఆయా పోస్టులను నేరు గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్‌–3 సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులకు తాజా రోస్టర్‌ పాయింట్లను తయారు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement