డిమాండ్లు పరిష్కరించకపోతే.. ఎమ్మెల్యేలుగా పోటీ | Telangana Activists Need To Be Fixed For Their Demands | Sakshi
Sakshi News home page

Sep 10 2018 2:59 PM | Updated on Sep 10 2018 4:44 PM

Telangana Activists Need To Be Fixed For Their Demands - Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: తెలంగాణ ఉద్యమ కారుల డిమాండ్లు నెరవేర్చాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయలేదంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రూప్‌ రాజకీయాలు చేసేవారు తప్పా ఉద్యమ కారుల గురించి పోరాడే నాయకుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యలయం ముందు ఆందోళనలు చేస్తుంటే మేయర్‌ చూసుకుంటూ వెళ్తున్నాడు.. కానీ సమస్యలేంటని ఆడగకపోవడం సిగ్గుచేటన్నారు.

‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి ఉద్యమ కారులను గుర్తించి ప్రశంస పత్రం ఇవ్వాలి. అర్హత కలిగిన ఉద్యమ కారులకు పది వేల పింఛన్‌, వ్యాపారానికై పది లక్షల సబ్సిడీ లేక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగమైనా కల్పించాలి’అంటూ ఉద్యమకారుల కోరారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లు చేర్చకుంటే తామే ఎమ్మెల్యేలుగా పోటీచేస్తామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement