సార్‌ చుట్టూచేరి భోరున ఏడ్చిన విద్యార్థులు!

Teacher Retirement Student Urges Not To Leave Them In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు వృత్తిలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం, లేదంటే ఉద్యోగ విరమణ పొందడం సహజం. అయితే, కేవలం మాష్టారుగానే కాకుండా.. పిల్లలతో ఓ స్నేహితుడిలా, మార్గదిర్దేశకుడిగా వ్యవహరించేవారు అరుదు. అలాంటి వారిలో బజార్ హత్నూర్ మండలం ప్రాతమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ ఒకరు. ఆయన నిన్న (ఫిబ్రవరి 29) పదవీ విరమణ పొందారు. శంకర్‌ సార్‌ రేపటి నుంచి పాఠశాలకు రారని తోటి ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పడంతో.. పిల్లలు ఆయనను చుట్టూచేరి వెళ్లొద్దంటూ భోరున ఏడ్చారు. విద్యార్థులు తనపట్ల చూపిన ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ కన్నీరు పెట్టారు.
(చదవండి: ఉచ్చుకు చిరుత బలి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top