నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
రోడ్డుప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
Dec 5 2015 10:39 AM | Updated on Aug 30 2018 3:56 PM
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జిల్లా రామన్నపేట మండలం కక్కినేని పంచాయతి పరిధిలోని రంగమ్మగూడెం గ్రామానికి చెందిన గుండగంటి ప్రభాకర్‌రావు(50) ఎల్లారెడ్డి గూడెంలో ఉన్న 12వ బెటాలియన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పాఠశాలకు బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement