2090లోనూ టీడీపీకి అధికారం రాదు: హరీశ్ రావు | TDP will not get power after 6 months | Sakshi
Sakshi News home page

2090లోనూ టీడీపీకి అధికారం రాదు: హరీశ్ రావు

May 20 2014 1:22 AM | Updated on Sep 2 2017 7:34 AM

2090లోనూ టీడీపీకి అధికారం రాదు: హరీశ్ రావు

2090లోనూ టీడీపీకి అధికారం రాదు: హరీశ్ రావు

తెలంగాణలో 2019లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఆశపడుతున్నారని.. 2019లో కాదు 2090లో అయినా టీడీపీకి అధికారం రాదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2019లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఆశపడుతున్నారని.. 2019లో కాదు 2090లో అయినా టీడీపీకి అధికారం రాదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు, హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అవుతున్నాయని, ఇకపై టీఆర్‌ఎస్‌లోకి ప్రతీరోజూ చేరికలుంటాయని చెప్పారు. తెలంగాణకు జాతిపితలాంటి నేత కేసీఆర్ అని, అలాంటి నాయకుడే సీఎం అవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement