'బాబు దోషి అనడానికి ఆధారాలున్నాయి' | Tammineni veerabhadram takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు దోషి అనడానికి ఆధారాలున్నాయి'

Jun 23 2015 2:24 PM | Updated on Sep 3 2017 4:15 AM

'బాబు దోషి అనడానికి ఆధారాలున్నాయి'

'బాబు దోషి అనడానికి ఆధారాలున్నాయి'

ఓటుకు కోట్లు అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడు సహా ఆధారాలున్న అందరినీ అరెస్ట్ చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడు సహా ఆధారాలున్న అందరినీ అరెస్ట్ చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు దోషి అనడానికి ఆధారాలు ఉన్నాయని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారన్న చంద్రబాబు...ఆ గొంతు తనదేనని స్పష్టం చేశారని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఇరు రాష్ట్రాలు రాజీ దిశగా వెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. సెక్షన్-8 అవసరం లేదని, ఎన్నికైన ప్రభుత్వాలకే అధికారం ఉండాలన్నారు. మీడియాపై ఆంక్షలను తాము వ్యతిరేకిస్తున్నామని తమ్మినేని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement