టీఆర్ఎస్తో చేరనున్న ఎమ్మెల్యే తలసాని | Talasani srinivas yadav to join TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్తో చేరనున్న ఎమ్మెల్యే తలసాని

Sep 1 2014 8:30 AM | Updated on Aug 15 2018 9:22 PM

టీఆర్ఎస్తో చేరనున్న ఎమ్మెల్యే తలసాని - Sakshi

టీఆర్ఎస్తో చేరనున్న ఎమ్మెల్యే తలసాని

తుమ్ముల నాగేశ్వరరావు షాక్ నుంచి తేరుకోకముందే టీడీపీకి మరోసారి ఎదురు దెబ్బ తగలబోతుంది.

హైదరాబాద్ : తుమ్ముల నాగేశ్వరరావు షాక్ నుంచి తేరుకోకముందే టీడీపీకి మరోసారి ఎదురు దెబ్బ తగలబోతుంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తెలుగుదేశం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే సైకిల్ దిగనున్నారు. ఆయన సోమవారం ఉదయం పది గంటలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్....కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

గత కొంతకాలంగా తలసాని టీడీపీని వీడుతారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.  తెలంగాణ శాసనసభ టీడీపీ పక్ష నాయకుడి పదవిని ఆశించిన తలసాని.... ఆ పదవిని ఎర్రబెల్లి దయాకరరావుకు కట్టబెట్టడంతో అసంతృప్తిగా ఉన్నారు. కాగా తలసాని సన్నిహితుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు రాయబారం ఫలించటంతో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తలసానితో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement