
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పంపించిన సరుకులతో బ్రాహ్మణ దంపతులు
సనత్‌నగర్: ఓ పురోహితుడు వాహనదారులను యాచిస్తున్న సంఘటన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలచివేసింది. ‘హతవిధీ’ శీర్షికన లాక్‌డౌన్ సమయంలో జనులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలుస్తూ ఓ పేద బ్రాహ్మణుడు వాహనదారులను యాచిస్తుండడంపై ‘సాక్షి’లో బుధవారం ఫొటో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మంత్రి ఆగమేఘాలపై వారి వివరాలను సేకరించి వారికి సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును మంత్రి తలసాని అందజేశారు.(సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే)