
సాక్షి, హైదరాబాద్: అన్నిరంగాల మేధావులకు నిలయం శాసనమండలి అని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. ఒడిశాలో శాసనమండలి ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రి నృసింగ చరణ్‌సాహూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమ వారం రాష్ట్ర శాసనమండలిని పరిశీలించింది. వీరికి మండలి ప్రాముఖ్యత, నియమాలు, పని తీరు, వసతుల గురించి స్వామిగౌడ్ వివరించా రు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల, సామాజిక, రాజ కీయ, మేధాసంపత్తి తదితర రంగాల సమస్య లు, అనుభవాల గూర్చి అర్థవంతమైన చర్చ జరి గే అవకాశం మండలిలో ఉంటుందన్నారు. దేశం లోని 7 రాష్ట్రాల్లో మండలి ఉందని, అన్ని రాష్ట్రా ల్లో మండలి ఏర్పడితే అన్నిరంగాలపై సవివరంగా చర్చించే అవకాశం ఉంటుందన్నారు. ఒడిశా బృందానికి అన్ని వివరాలను శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు వివరించారు.