రామ భక్తులంతా జైల్లో ఉన్నారు: పరిపూర్ణానంద

Swami Paripoornananda Comments On Police Arrests - Sakshi

అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో పరిపుర్ణానందకు మద్దుతుగా పలు హిందూ సంస్థల ప్రతినిధులు నిరసన తెలపగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాలయానికి కూడా వెళ్లనివ్వడం లేదని, మంచిపై దాడి చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తామని తెలిపారు. రామ భక్తులంతా జైల్లో ఉన్నారని, బేషరతుగా విడిచిపెట్టాలన్నారు. తన ఒక్కడికైనా పాదయాత్ర అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తాము ఏవరిపైనా విమర్శలు చేయమని అనుమతివ్వాలన్నారు. దాడి చేయొచ్చని అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారని.. అమరనాథ్‌ యాత్రికులపై దాడులు జరుగుతున్నాయని భక్తులను అడ్డుకుంటారా ప్రశ్నించారు.

చదవండి :

పరిపూర్ణానంద హౌస్‌ అరెస్టు!

కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top