లొంగిపోవడమే శరణ్యం..

Supreme And High Courts Pulled Out Ravi Prakash Bail Petition - Sakshi

దారులన్నీ దిగ్బంధం

రవిప్రకాశ్‌కు కోర్టుల్లో దక్కని ఊరట

లొంగిపోక తప్పని పరిస్థితి

బెంగళూరు, ముంబైలో కొనసాగుతున్న గాలింపు

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్‌ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. తరువాత బెంగళూరుకు, అక్కడ నుంచి ముంబై, గుజరాత్‌కు వెళ్లినట్లు.. తెలవడంతో పోలీసులు ఆయా నగరాల్లో అతని కోసం గాలించారు. పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్‌ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్‌ కార్డులు మారుస్తూ. సోషల్‌ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్‌ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. 

ఒత్తిడి పెంచుతున్న బృందాలు
శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్ట, నిధుల మళఙ్లంపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్‌ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌లు 2018 మేలో మీడియా నెక్ట్స ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్సీ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.

లొంగిపోవడమే శరణ్యం..
వాస్తవానికి మే చివరి వారంలో రవిప్రకాశ్‌ లొంగిపోతాడన్న సమాచారం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సాధ్యపడలేదని సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇప్పుడు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు. ఇందే సమయంలో రవిప్రకాశ్‌తో పాటు మరారీలో ఉన్న మరో నిందితుడు శివాజీ ఆచూకీ కూడా పోలీసులకు ఇంతవరకు చిక్కలేదు. పోలీసులు అన్ని వైపులా ఒత్తిడి పెంచుతుండడంతో వీరిద్దరూ లొంగిపోతారా? పరారీలోనే ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top