వాగులో పడి మామాఅల్లుళ్ల మృతి | sun in law, and uncle died due to drown | Sakshi
Sakshi News home page

వాగులో పడి మామాఅల్లుళ్ల మృతి

May 12 2015 10:53 PM | Updated on Sep 3 2017 1:54 AM

ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్కంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్: ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్కంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దస్రుపటేల్‌గూడ గ్రామానికి చెందిన చిక్రమ్ కిషన్, రాంబాయిల కుమారుడు పవన్(9), పవన్‌కు వరసకు మామ అయిన సిడాం సూర్యభాన్ (40) జైతుపటేల్‌గూడ గ్రామంలో పెళ్లికి వెళ్తున్నారు.

రెండు గ్రామాల మధ్య ఉన్న చిక్‌మన్ ప్రాజెక్టును నాటు పడవ సాయంతో దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, లక్కంపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించిన మామఅల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement