
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సుల్తానాబాద్‌లో విద్యార్థులు ఇండియా చిత్రపటంలా నిలిచారు. ధర్మారంలో సాయిమణికంఠ, బ్రిలియంట్ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలపై నృత్యాలు చేశారు. కాల్వశ్రీరాంపూర్ అల్ఫోర్స్, గర్రెపెల్లి పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.