
సాక్షి, జనగామ: జనగామ మండలం చౌడారం మోడల్ పాఠశాల విద్యార్థినులు గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఐరన్ మాత్రలు మింగిన విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మళ్లీ ఐరన్ మాత్రలు తీసుకున్న విద్యార్థినుల్లో సుమారు 20 మందికి పైగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహ నిర్వాహకులు తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ట్యాబెట్లు ఇచ్చి పంపించారు.