'పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించండి' | students dharna in nizamabad | Sakshi
Sakshi News home page

'పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించండి'

Aug 20 2015 1:41 PM | Updated on Sep 15 2018 4:12 PM

పెండింగ్‌లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంఘం విద్యార్థులు ధర్నాకు దిగారు.

బాన్సువాడ: పెండింగ్‌లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంఘం విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 2014-15 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్‌షిప్‌లకు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని బీసీ సంఘం విద్యార్థి నాయకులు కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement