విషాదం.. నదిలో కాలు జారి ముగ్గురు మృతి | Four Missing in Manjeera River Tragedy at Budimi, Kamareddy | Sakshi
Sakshi News home page

విషాదం.. నదిలో కాలు జారి ముగ్గురు మృతి

Jun 5 2026 6:03 PM | Updated on Jun 5 2026 7:18 PM

Four Missing in Manjeera River Tragedy at Budimi, Kamareddy

సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి శివారులో మంజీరా నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులు పిట్లం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన పావని (15),లింపేట్ మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన అనిత (40), శివాని (13) తల్లి కూతురని తెలుస్తోంది. భాను ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

పండరి అనే వ్యక్తి మంజీరా నది వద్ద ఎల్లమ్మ పండగ నిర్వహించడంతో బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిలోకి దిగిన ఓ యువతి, ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు నీటిలో మునిగి మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement