కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-1 పనులకు ఆదివారం భూమి పూజ జరిగింది.
కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-1 పనులకు ఆదివారం భూమి పూజ జరిగింది. ఈ పనులను సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్ ప్రారంభించారు. ఒక్కోటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను ఎన్టీపీసీ ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ఈడీ ప్రశాంత్‌కుమార్ మహపాత్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.