ఉపాధ్యాయుడు లేని గోకొండ పాఠశాల | Staff Shotage In Gokonda Schhol Adilabad | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడు లేని గోకొండ పాఠశాల

Jun 25 2018 1:31 PM | Updated on Aug 17 2018 2:56 PM

Staff Shotage In Gokonda Schhol Adilabad - Sakshi

ఉపాధ్యాయుడి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

బజార్‌హత్నూర్‌(బోథ్‌): మండలంలోని గోకొండ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలకు 23రోజులుగా ఉపాధ్యాయుడిని నియమించడంలేదు. గత మార్చిలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్‌ కాగా.. తిరిగి ఉపాధ్యాయుడిని నియమించలేదు. ఏరోజైనా ఉపాధ్యాయుడు రాకపోతాడా.. అని నిత్యం పాఠశాలకు వెళ్తున్న ఒకటి నుంచి ఐదు వరకు చదివే 45 మంది విద్యార్థులు నిరాశతో ఇంటికి తిరిగి వ స్తున్నారు. విద్యాధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఫలితం లేకుండాపోయిందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.

కనీసం టీసీలు రాసిస్తే భా రమైన ‘ప్రైవేట్‌’లోనైనా చదివిస్తామని ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. ఈ విషయమై ఎంఈవో శ్రీకాంత్‌ను సంప్రదించగా.. గోకొండ పాఠశాల ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలోనిదని, ఇతర పాఠశాలల నుంచి ఎవరినైనా డిప్యూటేషన్‌పై పంపుతామంటే అదన పు ఉపాధ్యాయులు లేరని తెలిపారు. సీఆర్‌టీల రెన్యూవల్‌ ప్రక్రియ ఉపాధ్యాయుల బదిలీల కౌ న్సెలింగ్‌ తర్వాతే ఉంటుందన్నారు. విద్యార్థులు నష్టపోకుండా తాత్కాలిక ఉపాధ్యాయుడిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement