నీరా స్టాల్‌తోపాటు తెలంగాణ వంటకాల ఫుడ్‌కోర్టు

Srinivas Goud Over Neera Stall And Food Court At Tank Bund - Sakshi

ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన నీరాస్టాల్‌తోపాటు తెలంగాణ వంటకాలతో ఒక ఫుడ్‌కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌ లోని జలవిహార్‌ వద్ద ఉన్న స్థలాన్ని సోమవారం ఆయన ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్, టూరిజం ఎండీ మనోహర్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులను కాపాడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. అందులో భాగంగా గౌడ కులవృత్తిని ఆదుకోవడానికి నీరాను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top