వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు | Special trains to clear summer rush | Sakshi
Sakshi News home page

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Apr 12 2017 1:03 AM | Updated on Sep 5 2017 8:32 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌–కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి కాకినాడ, అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌–కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 5.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరు గుప్రయా ణంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి నాంపల్లి చేరుకుంటుంది.

అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు..: హైదరాబాద్‌–అహ్మదాబాద్‌ (07018/07017) ప్రత్యేక రైలు ఈ నెల 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 6.20 కి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 12.30కు అహ్మదాబాద్‌ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27, మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 6.15కు అహ్మదాబాద్‌ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement