
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–విశాఖ (82733/82734) స్పెషల్ సువిధ ట్రైన్ ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.30 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 5.35కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి (82730) సువిధ ట్రైన్ ఈ నెల 17న రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.55కు లింగంపల్లి చేరుకుంటుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్(82729) సువిధ ట్రై న్ ఈ నెల 20న రాత్రి 9.30 కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రా బాద్ చేరుకుంటుంది.