ర్యాష్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ | Special drive on the rash driving | Sakshi
Sakshi News home page

ర్యాష్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్

May 6 2015 3:52 AM | Updated on Aug 21 2018 7:34 PM

ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం వన్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు యూనిఫాం లేకుండా తని ఖీలు చేపట్టి 58 వాహనాలను పట్టుకుని ఠాణాకు తరలించారు.

ఠాణాకు 58 వాహనాలు తరలింపు
ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా


కోల్‌సిటీ :  ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం వన్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు యూనిఫాం లేకుండా తని ఖీలు చేపట్టి 58 వాహనాలను పట్టుకుని ఠాణాకు తరలించారు. పట్టుబడి న వాహనదారులకు డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి వన్‌టౌన్‌లో వినూత్నంగా కౌ న్సెలింగ్ నిర్వహించారు. ర్యాష్, ట్రిపుల్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయకులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లెసైన్స్ లేని యువకులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.

స్పెషల్ డ్రైవ్‌లో వన్‌టౌన్ పోలీసులు 40 వాహనాలు, ట్రాఫిక్ పోలీసులు 18 వాహనాలు పట్టుకున్నారని తెలిపారు. నిబంధన లు అతిక్రమించిన ఒక్కో వాహనదారుడికి రూ.వెయ్యి చొప్పున జరిమా నా విధించినట్లు వివరించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి కోర్టులో వారిని హాజరు పరుస్తామని హెచ్చరించారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ఆరె.వెంకటేశ్వర్, ట్రాఫిక్ సీఐలు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement