ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్‌ | Soon amendment notification to voter list | Sakshi
Sakshi News home page

ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్‌

Jan 21 2017 4:47 AM | Updated on Sep 5 2017 1:42 AM

ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్‌

ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్‌

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన దృష్ట్యా ఓటరు జాబితా సవరణ కోసం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌

భీమారం: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన దృష్ట్యా ఓటరు జాబితా సవరణ కోసం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారంలోని ఎస్‌వీఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘ఓటు హక్కు వినియోగం’పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సదస్సులో పాల్గొన్న అనం తరం భన్వర్‌లాల్‌ విలేకరులతో మాట్లాడుతూ 1 జనవరి 2017 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై చైతన్య పరచడానికి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నా మని, వారి సూచనలు పరిశీలిస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement