విహారయాత్రలో అపశ్రుతి: ఎంపీటీసీలకు గాయాలు | Six MPTC injured in Volvo bus accident in Anantapur District | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో అపశ్రుతి: ఎంపీటీసీలకు గాయాలు

Jul 1 2014 9:55 AM | Updated on Jun 1 2018 8:39 PM

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీటీసీల విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీటీసీల విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సదరు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు మంగళవారం అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో ఆరుగురు ఎంపీటీసీలు గాయపడ్డారు. వారిని గుత్తిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీటీసీల బృందం విహారయాత్రకు బయలుదేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement