ఓటు మీది.. అభివృద్ధి బాధ్యత నాది | Sirikonda Madhusudhana Chari Election Campaign In Warangal | Sakshi
Sakshi News home page

ఓటు మీది.. అభివృద్ధి బాధ్యత నాది

Nov 27 2018 9:46 AM | Updated on Aug 27 2019 4:45 PM

Sirikonda Madhusudhana Chari Election Campaign In Warangal - Sakshi

స్పీకర్‌పై పూల వర్షం కురిపిస్తున్న మహిళలు  

సాక్షి, భూపాలపల్లి: ‘మీరు ఓటు వేసి నన్ను గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది.. గడిచిన 50 నెలల పదవీ కాలంలో రూ.3 వేల కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను’ అని శాసన సభాపతి, టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన స్పీకర్‌కు కాశీంపల్లి వాసులు పూల వర్షం, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. నాడు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న కాశీంపల్లికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు, సైడ్‌ కాల్వలు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే అధికారాన్ని మరోమారు ఆంధ్రులకు అప్పగించినట్లేనని అన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దానని, ఫలితంగానే వ్యాపార రంగం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణరవి, కౌన్సిలర్లు తాటి హైమావతిఅశోక్, టీఆర్‌ఎస్‌ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మేకల సంపత్‌కుమార్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, సింగనవేని చిరంజీవి, మాడ హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

1
1/1

మహిళల కోలాటం మధ్య ర్యాలీగా వస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

Advertisement
 
Advertisement
Advertisement