రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్’ | Sakshi
Sakshi News home page

‘ఇంటి వద్దకే పండ్లు కార్యక్రమానికి అపూర్వ స్పందన‘

Published Sat, May 2 2020 6:59 PM

Singi Reddy Niranjan Reddy Visits Supply Fruits To Home In Moosapet - Sakshi

సాక్షి, హైదరాబాద్ :  కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. మూసాపేటలోని వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతుల నుంచి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా జరిగినట్లు తెలిపారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. (ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది: బండి సంజయ్‌ )

వాక్‌ ఫర్ వాటర్‌, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుందన్నారు. రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు, రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు.  88753 51555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందతాయని మంత్రి తెలిపారు.
(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్‌)

Advertisement
Advertisement