సింగరేణిలో కార్మికుడు మృతి | singareni worker dies accidently | Sakshi
Sakshi News home page

సింగరేణిలో కార్మికుడు మృతి

Feb 27 2016 9:36 AM | Updated on Sep 2 2018 4:16 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరామ్‌పూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే6 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.

శ్రీరామ్‌పూర్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరామ్‌పూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే6 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న మాలెం నర్సయ్య (55) శనివారం తెల్లవారుజామున టబ్‌ల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి విధులకు వచ్చిన నర్సయ్య మరికొద్దిసేపట్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా... ఆ లోపే ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందడంతో తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. నర్సయ్యకు భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement