ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు పాముకాటుతో మృతి చెందాడు.
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు పాముకాటుతో మృతి చెందాడు. ఇంట్లో నిద్రపోతున్న రామచంద్ర((50)ను నాగుపాము కాటేసింది. కుటుంబసభ్యులు రామచంద్రను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.