ramchandra
-
జిరాక్స్ షాప్ నుంచి ఏకంగా రూ.6 వేల కోట్ల బ్రాండ్..!
మనతోపాటు సామాన్యులుగా వచ్చి.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తి ఆదర్శంగా నిలుస్తారు కొందరు. వాళ్లు కూడా మనలానే పైకి ఎదిగే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు కూడా. కానీ ఆ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకి లోనవ్వకుండా సరైన నిర్ణయాలతో.. ఉన్నతస్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే రామచంద్ర అగర్వాల్. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదంటూ..అచంచలమైన కృషితో వస్త్రపరిశ్రమలో గొప్ప సక్సెస్‌ని అందుకుని అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. అయనే కొల్‌కతాకు చెందిన రామ్ చంద్ర అగర్వాల్. 1965లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడి కింద శరీరం అంత చచ్చుబడిపోయింది. అయినా..అతడిలో కష్టపడేతత్వం..అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారిక విద్యను పూర్తిచేసిన వెంటనే చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. దీంతో త్వరితగతిన ఉన్నతస్థాయికి చేరుకోలేమని గ్రహించి..వస్త్రపరిశ్రమ వైపుకి అడుగులు వేశాడు. అలా కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ప్రారంభించాడు. భారతీయ ఫ్యాషన్ వినియోగదారుల ట్రెండ్‌ని అర్థం చేసుకుంటూ..ఈ పరిశ్రమలో విజయం సాధించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంబించాడు. అలా 2000 ప్రారంభంలో ఢిల్లీకి మకాం మార్చి..2001లో తన మొదటి విశాల్ మెగా మార్ట్ స్టోర్‌ని ప్రారంభించాడు. ఇది మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా ఆకర్షించింది, చేరువైంది కూడా. దాంతో ఈ మార్ట్ కిరాణా సామాగ్రి, దుస్తులు..అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసే హాట్‌స్పాట్‌గా మారింది. అలా చుట్టపక్కాల మహా నగరాల వరకు ఈ మార్ట్ బ్రాంచ్‌లు విస్తరించాయి. అలా తన దుకాణాన్ని విస్తరించే క్రమంలో దాదాపు భారీగా అప్పులు చేశాడు. సరిగ్గా ఆ టైంలో 2008-09లో ప్రపపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అప్పు పెరిగిపోయింది, మరోవైపు కస్టమర్లు తగ్గిపోతున్నారు. చెప్పాలంటే రామ్‌చంద్రకు కఠినమైన సమయం ఇది. దాంతో 2011లో రూ. 2 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శ్రీరామ్ గ్రూప్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీకి దాదాపు రూ. 70 కోట్లకు అమ్మేశారు. కొత్త యజమాన్యంలోకి ఉన్నప్పటికీ విశాల్ బ్రాండ్ కొనసాగడం విశేషం. ఆ తర్వాత అగర్వాల్ వీ2 రిటైల్ లిమిటెడ్ రూపంలో కొత్త వెంచర్ ప్రారంభించాడు. మొదటి స్టోర్ జంషెడ్‌పూర్‌లో ప్రారంభించారు. అనతి కాలంలో వేగంగా పుంజుకుని లాభాల బాటలు పట్టింది. కొన్నేళ్లకు ఏకంగా వంద కోట్ల టర్నోవర్‌ని అందుకుంది. పైగా అనేక భారతీయ నగరాల్లో 150కి పైగా ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది. అలా 2025 కల్లా వీ2 రిటైల్ భారతదేంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బ్రాండ్‌లో ఒకటిగా ఉద్భవించింది. పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6వేల కోట్ల టర్నోవర్‌కు మించిపోయింది. ఇంతటి బిజీ పరిస్థితుల్లోనూ ఆనందానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోడాయన. ఆయనకు అందమై భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ల సహాయ సహకారాలతోనే ఇంత పెద్దసక్సెస్ అందుకున్నానని చెబుతుంటాడు రామ్‌చంద్ర అగర్వాల్. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) (చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
ఏమ్మా.. శర్మాజీ ఇల్లెక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఇతడో కాస్ట్లీ నేరగాడు. విమానాల్లో వస్తాడు. ఖరీదైన ప్రాంతాలకు వెళ్తాడు. మహిళల మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తాడు. ఈవిధంగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 150 నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు రాజస్తాన్ పోలీసులకు ఆదివారం చిక్కాడు. అతడే రామ్‌చంద్ర బవారియా. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ ప్రాంతానికి చెందిన ఇతడు పదిహేడేళ్ల ప్రాయం నుంచే నేరాల బాటపట్టాడు. 13 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. 150కిపైగా నేరాలు: తొలినాళ్లలో ఇళ్లలో చోరీలు, దోపిడీలు చేసిన బవారియా కొన్నేళ్లుగా కేవలం చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాల్లో ఇప్పటి వరకు 150కి పైగా నేరాలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇతడికి నెట్వర్క్ ఉంది. ఒక్కడే ఆయా రాష్ట్రాల్లోని నగరాలకు విమానాల్లో వెళ్తుంటాడు. తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడున్న బంధువులు, స్నేహితుల సాయంతో హైస్పీడ్ బైక్‌లు సమీకరించుకుంటాడు. స్నాచింగ్‌కు వెళ్లేప్పుడు వాహనం వెనుక కూర్చునే (పిలియన్ రైడర్) ఇతడు ఖరీదైన ప్రాంతాల్లోనే ఎక్కువగా చేతివాటం ప్రదర్శిస్తాడు. శర్మాజీ పేరుతో ‘వెతుకులాట’.. నేరం చేయడానికి వెళ్లే ప్రతిసారీ కచ్చితంగా టోపీ పెట్టుకుంటాడు. అందుకే ఇతడికి నేర ప్రపంచంలో టోపీవాలా అనే పేరు కూడా ఉంది. బైక్‌ను ఆపి చిరునామా వెతుకుతున్నట్లు నటిస్తూ ‘టార్గెట్’దగ్గరకు వెళ్తాడు. ‘శర్మాజీ ఇల్లు ఎక్కడ?’అంటూ వారిని ప్రశ్నిస్తాడు. సమాధానం చెప్పిన ఆ మహిళలు వెనక్కి తిరగ్గానే మెడలోని చైన్ లాక్కుని బైక్‌పై ఉడాయిస్తాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం రాణాజీ ఇల్లు ఎక్కడ? అని కూడా అడుగుతుంటాడని పోలీసులు చెప్తున్నారు. స్నాచింగ్ చేసిన వెంటనే దొంగసొత్తుతో తన స్వస్థలానికి వెళ్లిపోతుంటాడు. జైపూర్ పోలీసులకు ముప్పుతిప్పలు... ఐదు నెలలుగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న టోపీవాలా అక్కడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన తన బంధువుతోపాటు మరో ఇద్దరితో కలసి 50 నేరాలు చేశాడు. ఒక్కోరోజు ఏకంగా ఎనిమిది నేరాలు చేసేవాడు. బోగస్ పత్రాలను వినియోగించి, సొత్తు విలువలో 50 నుంచి 70 శాతం వచ్చేలా ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెడతాడు. ఒకవేళ తాను పోలీసులకు చిక్కినా రికవరీ ఉండకూడదనే ఇలా చేస్తుంటాడని పోలీసులు చెప్తున్నారు. ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌లో చిక్కిన ఆధారంతో రామ్‌చంద్రను పోలీసులు గుర్తించారు. విమాన ప్రయాణాల ఆధారంగా... ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి జైపూర్‌లో అతడిని పట్టుకుంది. ఇతడి ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలను పరిశీలించగా చెన్నై, బెంగళూరు, సూరత్, హైదరాబాద్‌కు అనేకసార్లు విమానంలో ప్రయాణించినట్లు తేలింది. దీని ఆధారంగా అతడు ఆయా నగరాల్లో నేరాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక లోతుగా విచారించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ నేరం చేశాడో తెలుసుకోవడానికి జైపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఇక్కడి అధికారుల్ని సంప్రదించి రామ్‌చంద్ర వివరాలు అందించాలని భావిస్తున్నారు. -
జిల్లా పరిషత్ సీఈఓకు స్థాన చలనం
అనంతపురం సిటీ : జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రను టీటీడీ (తిరుమల తిరుపతి) డిప్యూటీ ఈఓగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సోషల్ వెల్ఫేర్ ఉన్నత కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు సీఈఓ సోషియల్ వెల్ఫేర్‌లో మొదట రిపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి టీటీడీకి వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో పది రోజుల్లో ఆయన సీఈఓ స్థానం నుంచి బదిలీ కానున్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు తాళలేక ఇద్దరు మృత్యువాతపడ్డారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాణావత్ రాంచందర్(70) శుక్రవారం వడదెబ్బకు తాళలేక ఇంట్లోనే చనిపోయాడు. అలాగే, నెన్నెల మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వేల్పుల శంకరయ్య(65) గురువారం తోట కాపలాకు వెళ్లాడు. సాయంత్రానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం వేకువజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. -
పాముకాటుతో సింగరేణి కార్మికుని మృతి
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు పాముకాటుతో మృతి చెందాడు. ఇంట్లో నిద్రపోతున్న రామచంద్ర((50)ను నాగుపాము కాటేసింది. కుటుంబసభ్యులు రామచంద్రను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎంపీపీ ఒత్తిళ్ల నుంచి అధికారులను కాపాడండి
అనంతపురం సెంట్రల్ : ఉరవకొండ ఎంపీపీ సుంక రత్నమ్మ ఒత్తిళ్లు తట్టుకొని అధికారులు పనిచేసే పరిస్థితి లేదని ఆ మండల పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ సర్పంచులు జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్రలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం జెడ్పీ కార్యాలయంలో వారిని కలిసి పరిస్థితిని వివరించారు. ఎంపీపీ ఒత్తిళ్లతో అధికారులంతా సెలవుపై వెళ్లిపోతున్నారన్నారు. మండలంలో ఎంపీడీఓ, ఈఓఆర్డీలు లేరని వివరించారు. ఇన్చార్జ్ ఎంపీడీఓగా ఉన్న శివకుమార్ , రెగ్యులర్ ఈఓఆర్డీ రషీద్ దీర్ఘకాలిక సెలవు పెట్టారన్నారు. తమ మండలానికి వెంటనే అధికారులను నియమించాలని కోరారు. అలాగే వారికి ఎంపీపీ నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి 750 దీపం కనెక్షన్లు మంజూరుకాగా.. సర్పంచులకు తెలియకుండానే పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో రాకెట్ల సర్పంచు పెన్నయ్య, పెద్దముష్టూరు సర్పంచు కృష్ణమూర్తి, బూదగవి సర్పంచు చిరంజీవి, నెరిమెట్ల సర్పంచు చిదానందప్ప, ఇంద్రావతి సర్పంచు ఓబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు బాబు, హనుమప్ప, మారెన్న తదితరులు పాల్గొన్నారు.


