ఎంపీపీ ఒత్తిళ్ల నుంచి అధికారులను కాపాడండి | Save officers from the pressures | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఒత్తిళ్ల నుంచి అధికారులను కాపాడండి

Mar 5 2015 1:57 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఉరవకొండ ఎంపీపీ సుంక రత్నమ్మ ఒత్తిళ్లు తట్టుకొని అధికారులు పనిచేసే పరిస్థితి లేదని ఆ మండల పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ సర్పంచులు జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్రలకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం సెంట్రల్ : ఉరవకొండ ఎంపీపీ సుంక రత్నమ్మ ఒత్తిళ్లు తట్టుకొని అధికారులు పనిచేసే పరిస్థితి లేదని ఆ మండల పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ సర్పంచులు జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్రలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం జెడ్పీ కార్యాలయంలో వారిని కలిసి పరిస్థితిని వివరించారు. ఎంపీపీ ఒత్తిళ్లతో అధికారులంతా సెలవుపై వెళ్లిపోతున్నారన్నారు. మండలంలో ఎంపీడీఓ, ఈఓఆర్‌డీలు లేరని వివరించారు.
 
 ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా ఉన్న శివకుమార్ , రెగ్యులర్ ఈఓఆర్‌డీ రషీద్ దీర్ఘకాలిక సెలవు పెట్టారన్నారు. తమ మండలానికి వెంటనే అధికారులను నియమించాలని కోరారు. అలాగే వారికి ఎంపీపీ నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి 750  దీపం కనెక్షన్‌లు మంజూరుకాగా.. సర్పంచులకు తెలియకుండానే పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో రాకెట్ల సర్పంచు పెన్నయ్య, పెద్దముష్టూరు సర్పంచు కృష్ణమూర్తి, బూదగవి సర్పంచు చిరంజీవి, నెరిమెట్ల సర్పంచు చిదానందప్ప, ఇంద్రావతి సర్పంచు ఓబిలేసు, వైఎస్సార్‌సీపీ నాయకులు బాబు, హనుమప్ప, మారెన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement