చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి | Short films provide encouragement says Actor Suman | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి

Jun 21 2016 8:20 AM | Updated on Apr 3 2019 8:56 PM

చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి - Sakshi

చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి

తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలకు సబ్సిడీలతో ప్రోత్సాహం అందించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు.

 సినీనటుడు సుమన్
 హుజూర్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలకు సబ్సిడీలతో ప్రోత్సాహం అందించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెద్ద సినిమాల ధాటికి చిన్న సినిమాల నిర్మాతలు తట్టుకునే పరిస్థితి లేదన్నారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు థియేటర్ల ఏర్పాటు ద్వారా చేయూతనందించాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నేపథ్యంతో చిత్రీకరించిన సినిమాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు అందజేయాలన్నారు. అనంతరం సుమన్‌ను పలువురు సన్మానించారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ నగరపంచాయతీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
 కోదాడలో ‘ఇదో ప్రేమలోకం’
 కోదాడ : కోదాడ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఇదో ప్రేమలోకం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రముఖ నటుడు సుమన్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. సోమవారం హీరో సుంకర అశోక్, హీరోయిన్ తేజారెడ్డి,సుమన్‌లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు.  కోదాడవాసి సుంకర పుల్లయ్య నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోడి రామకృష్ణ శిష్యు డు కరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement