కేసీఆర్కు ఫర్మాన పంపిన షబ్బీర్ అలీ | shabbir ali sent Farmana to telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ఫర్మాన పంపిన షబ్బీర్ అలీ

Mar 4 2015 2:08 PM | Updated on Oct 1 2018 3:56 PM

కేసీఆర్కు ఫర్మాన పంపిన షబ్బీర్ అలీ - Sakshi

కేసీఆర్కు ఫర్మాన పంపిన షబ్బీర్ అలీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం సీఎంకు ఓ ఫర్మాన పంపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం సీఎంకు ఓ ఫర్మాన పంపించారు. కేసీఆర్ ఇప్పటివరకూ ప్రధానంగా 101 హామీలిచ్చారని, అందులో మూడు మాత్రమే పూర్తిగా అమలు అయ్యాయని షబ్బీర్ అలీ అన్నారు. పాక్షికంగా మరో ఎనిమిది హామీలు అమలు అయ్యాయని, ఆ వివరాలు సరైనవో కావో కేసీఆరే చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్నో ఫర్మానాలో మార్కు చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే కేసీఆర్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement