'ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలి' | SevenTelangana mandals don't merge with Seemandhra, demands TJAC | Sakshi
Sakshi News home page

'ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలి'

Jul 10 2014 12:24 PM | Updated on Aug 28 2018 5:36 PM

పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీజేఏసీ డిమాండ్ చేసింది.

పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీజేఏసీ డిమాండ్ చేసింది. గురువారం నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాలో టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

దాంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలు తెలంగాణలో ఉంచాలని ఆ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఏడు మండలాలు తెలంగాణలో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర ఎంపీలు గత రెండు రోజులుగా లోక్సభలో నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement