ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల నత్త నడకపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కేంద్రం ప్రశ్నించింది. నిర్మాణ పనులకు డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జవాబు ఇవ్వడంతో అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
పోలవరం పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగ్గా ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.


